Friday, December 4, 2009

తీయని తలపు

వెన్నెల వేలుగుజిలుగుల్లో మెరిసింది ఓ అధరం !
అది ఓ కమనీయ కళావిగ్రహం
ఆ విరించి విలాసం , ఈ సుమధుర మధురం
దానికి ప్రతిబింబం ఆమె సుమనోహర వదనం.

ఆమె చూపుల చిక్కులు నా మదిలో
ఓ కావ్యమై మెదిలి, కవనమై మెరవగా
మాటరానివేళ మౌనరాగమై ననుచేరి
"యదమాటున దాగిన కోరికను నీ కౌగిలిలో బంధించావా"
అంటూ నాకళ్ళు తిప్పుకోనీయకుండా
కట్టేసిన ఆ కళ్లు , అనుక్షణం స్మరణీయం.
ప్రతిక్షణం తప్పదు నాకిక ఆమె మననం.

తలపులమడిలో తనువును ఆరబోసిన ఈ తరుణం,
తొలిముద్దు శృంగారమాయేనే ఈ పవనం.
మరి ఈ తనూలతను తాకినా ఈ పవనం పావనం.

గాలినైనా కాకపోతిని ఆమె గుండెలునిండగా
రవికనైనా కాకపోతిని ఆమె స్పర్శకు నోచగా
మాలనైనా కాకపోతిని ఆమె కురులను చేరగా
కవితనైనా కాకపోయిని ఆమెకై పదములు కూర్చగా........

Tuesday, August 25, 2009

ఇలా వుండాలనివుంది!


కాలంతో కరిగిపోయే కర్పూరంలా వుందాలనిలేదు నీతో
సంద్రంలో ఇమిడిపోయే నీలంలా వుండాలనివుంది

చిరు కాలం నిలిచే అసత్యంలా వుందాలనిలేదు నీతో
చిరకాలం నిలిచే సత్యంలా వుండాలనివుంది

రోజురోజుకి క్షీణించే అమావాస్య చంద్రుడిలా వుందాలనిలేదు నీతో
రోజురోజుకి వెన్నెల పెంచే పౌర్ణమి చెంద్రుడిలా వుండాలనివుంది

కాని..... ఏ గ్రహము నా ఈ చంద్రుడికి గ్రహణం పట్టకుండా వుండాలని ,
అందరు దేవుళ్ళని నిగ్రహంతో అనుగ్రహించమని,
ఏకాగ్రతచిత్తయై,

నాలోని నీలో నేను

Monday, August 24, 2009

తెలియని తలపు


నీకు తెలిసిందా!
నాకు తెలిసింది. నాకు తెలియకుండా నీకు తెలిసింది యేమిటానుకుంటున్నావా?
లేక నాకు తెలియకుండా నీకేలా తెలిసిందా అని ఆశ్చర్య పడుతున్నావా?
నాకు తెలిసున్న ప్రతిదీ నీకు తెలుసని , నీకు తెలిసున్న ప్రతిదీ నాకు తెలుసనుకుంట్టున్నావా?
అది నిజమే!
ఆయినా తెలియంది తెలుసుకోవడంలో తప్పు లేదుకదా!
తెలుసా తెలుసా? అని అడిగితే , ముమ్మాటికీ తెలుసనే చెబుతావు.
తెలిసిందే తెలుసుకోవడానికి ఇన్నాళ్ళు పడితే, తెలియంది తెలుసుకోవడానికి ఇంకెన్నాళ్ళు పడుతుందో!
ఇన్నాళ్లూ నాకు తెలిసిందో లేదో తెలియదుకాని నీకు మాత్రం తెలుసనుకున్నాను!
తెలియంది తెలుసుకోవడం ఎంత తెలియనితనమని అనుకుంటున్నావా?
ఐతే ఇప్పటికైనా తెలుసుకో ,నాకు తెలిసున్న , నీకు తెలుసనుకుంటున్న , తెలియని తలపుని.

మరి...
నా తలపులో , వలపులో
నా ఊహలలో , ఊసులో
నా తపనలో , తీరికలో
నా శ్వాసలో , స్పర్శలో
నా ఆశలో , ఆర్తిలో
నా కలలలో , కలతలో
నా ఆరాటంలో , మొమాటంలో
నా దరహాసంలో , చిరుహాసంలో
నా నూపురిలొ , నా ఊపిరిలో........
నువ్వు వున్నావని నీకు ఇప్పటికైనా తెలిసిందా?

క్షరం కాని అక్షరం ఎంత గమ్మత్తైనదో కదా!
అందుకే ఒకే ఒక అక్షరాన్ని మార్చాను. నా ఈ ఆనందానుభూతి రెండో వైపు కూడా నీకు తెలియాలని.

మరి...
నా తలపులో , వలపులా
నా ఊహలలో , ఊసులలా
నా తపనలో , తీరికలా
నా శ్వాసలో , స్పర్సలా
నా ఆశలో , ఆర్తిలా
నా కలలలో , కలతలా
నా ఆరాటంలో , మొమాటంలా
నా దరహాసంలో , చిరుహాసంలా
నా నూపురిలొ , నా ఊపిరిలా.......
నువ్వు మారవని ఇప్పటికైనా తెలుసుకో.