Saturday, October 6, 2012

జాలువారే నా చెలి జ్ఞ్యాపకాలు

చెలి కళ్ళేమో కలల వాకిట్లో బిగి కౌగిళ్ళ బంధించమంటుంటే...
ముక్కు మాత్రం మరులు గొలిపే మోముకి ముచ్చెమటలు పట్టించమంటోంది  ...
మరి ఆ పెదవేమో...అబ్బా!...ఇహ ఆపమంటూ పలువరసలని పలు మార్లు వేడుకుంటోంది..
ఆమె చెవి మాత్రం ఆయసపు చప్పుళ్ళను గుప్పుగా వినిపించమంటుంటే...
మెడేమో పుట్టుమచ్చలకు జతలు చేర్చమని ముని పంటిని మొహిస్తోంది..
పైయ్యద  పై పైకి రమ్మంటూ పరువాలను నిగ్గదీస్తోంటే .....
నడుమేమో నయగారాల నొక్కుళ్ళలో నావేసి నడపమంతోంది..
నాభి నలంకరించిన ఆ చంద్రవంక మాత్రం...మగసిరి మగతలను మత్తెక్కిస్తోంది...
చీర చాటున దాగిన చీకటి మాత్రం ..పరువాల పరదాల మాటున దాగిన రహస్యాలను ఛేదించమంటుంటే    .
పారిజాతపు పాదాలేమో...నిశ్శబ్దపు పాన్పుపై పెనవేసుకోమ్మంటున్నాయి...
ఇలా పరువాలన్ని జలపాతాలై నన్ను తడిపెస్తానంటుంటే     ..
విరహపు పొదలు నన్ను కప్పేస్తుంటే...
ఇహ కంటికి కునుకుమ్మ కన్నుగీటి వెల్లిపోయేలా ఉంది...
ఇలా జాలువారే నా చెలి జ్ఞ్యాపకాలు మాత్రం నా ఎడదను చేలిపి చేష్టలతో కమ్మేస్తున్నాయి...
ఏంచేయను...??

Thursday, June 7, 2012

ఇది ఆ బ్రహ్మ వరమా....


కైరవ నిర్మిత తటాకాంచనాన ....
మందార మకరంద మిళింద మరంద సుగంధ వనాన ...
శత సహస్ర  కుసుమాలంకృత  మండపాన...
చందన కుంకుమాది శోభిత ఫాలముతో ..
విచలిత కుంతలముల తోడ ....
సలలిత లావణ్య సుధా మయూఖ రేఖ వోలె ...
చలువరాతి నేలపై చంద్రకాంత శిలను బూనిన
నీ మేని మెరుపును మరపించ
ఆ వెన్నెల సైతం మిన్ను తాకి వెల వెల బోయనే...
ఈ తనూలతను  తాకిన మరుక్షణం...... 
మరణమైనా చేరగ ప్రియమే ...
వికసిత శతదళ  శోభితములైన  నీ కన్నులు..
నా లోని వలరాజును కవ్వించగ సాగెనే
నీ చూపుల విరి తూపుల పవళించ కనుసైగన అనుమతించి,
నీవే సుమ పానుపువై ఆహ్వానించ,
వెలుగు రేఖల వేగాన నీపై వాలగ రానా... 
క్షణమోపక ......... 
ఇక నిన్ను నా గుండియలకు హత్తుకొనగ..
నా ఆణువణువూ రసఝరులతో ఉప్పొంగి ..
హిమాగ్ర శిఖరముల నడుమ ఊయలలూగుతున్న హాయి...
మృదు మధురమైన సుమ మాలికలు నా గుండెలపై అలరారుతున్న ఈ రేయి ...
వర్ణింప నా తరమా...
ఇది ఆ బ్రహ్మ వరమా....