Monday, August 30, 2010

ప్రణయ పరిచయమా...

నీలాకాశంలో అలవోకగా జారిన ఓ కాంతిపుంజమా ......కనుమరుగవకుమా.
స్వాతిచినుకు తోడుగా , నేలతల్లి సాక్షిగా
సప్తవర్ణావిష్కృతమైన ఇంద్రధనుసును చూప
నీ ఒడి బడిని వడి వడి గా సిద్ధం చేయి సుమా......

ఝుం ఝుం అని గుమ్ముగవాలే తూనీగమా.......కాస్తాగమ్మా
పూయద మధించ తెలిమంచు కరగనీవమ్మా.....

అల్లరి అల్లికల తెల్లని జాజి తీగమ్మా......గేళి చేయకుమా
కలకాని ఇలపై నీ జాజి రేమ్మను జార్చక నిలువరించుమా

ఆ హరివిల్లె నీ ఇల్లవగా ...
ఈ మధురమంతా మధిరయై నీమది నింపగా
ఈ జాజిపూల జాజరలో నీవు పరవశించి వేచిఉండ
నీయదపై వాల నా హృద్ఘోషను ఆప
ఆ బ్రహ్మ తరమా...
ప్రణయ పరిచయమా......

Wednesday, February 3, 2010

చిరిదీపం వేలిగించావా...

తలపు తోటలో చిలిపి గాలినౌదామనుకున్నా ...చిగురు మొగ్గగా తుంచేసావు...
స్నేహపుబాటలో పూదారినౌదామనుకున్నా ...నీరుపోయడం ఆపేసావ్....
మనసు మడిలో ఆనందపు మొలకనౌదామనుకున్నా .....విత్తును బూడిద చేసావు...
ఆనందాల అర్ణవంలో అలనౌదామనుకున్నా ...సూర్యుడివై ఆవిరిచేసావు...
అనురాగపు గగనంలో హరివిల్లునౌదామనుకున్నా ...జడివానవై నిలిపేసావు...
ఆరాటపు అడవిలో వెన్నెలనౌదామనుకున్నా ....కారుమేఘానివై కమ్మేసావు...
నా సరదాలన్నీ పరదాల మాటుకు వెళ్ళిపోయాయి....
నా చిలిపి చేష్టలన్నీ నిష్టూరపు కడలిలో కరిగిపోయాయి...
నా వన్నె చిన్నెలన్నీ నిన్నగా మారిపోయాయి...
నా ఆసల చిరుచినుకులు ఆవిరైపోయాయి...
ఎటు చూసినా అగాధమే కనపడుతోంది.
ఈ అలుపుల చీకటిలో ...చిరుదీపం వెలిగించలేవా.....